గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెం నుంచి దాసరిపాలెం గ్రామానికి వెళ్లే మార్గంలో స్వాగత ముఖద్వారాన్ని తెదేపా హయాంలో నిర్మించారు. శనివారం రాత్రి కొంతమంది దుండగులు ఆ ముఖద్వారాన్ని కూల్చి వేశారు. సమాచారం అందుకున్న రొంపిచర్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి చదలవాడ అరవింద బాబు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆర్చీ ధ్వంసం చేయడాన్ని ఖండించారు. వైకాపా ప్రభుత్వంలో గత ప్రభుత్వం నిర్మించిన కట్టడాలను కూల్చుకుంటూపోవడం దుర్మార్గపు చర్య అని ఆరోపించారు.