గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు, పాదచారునికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు కూడా గాయం కావటంతో పాదచారునికి వెంటనే ఫిట్స్ వచ్చింది. 104లో పనిచేస్తున్న సయ్యద్ అనే వ్యక్తి పాదచారునికి సపర్యలు చేశాడు. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటోవారిని బతిమిలాడినా.. ఒక్కరు కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అంబులెన్స్ వచ్చే వరకు వేచి చూసి ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.
మానవత్వం మంటగలిసిన వేళ.. - kommuru
గుంటూరు జిల్లా కొమ్మూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన వ్యక్తికి స్థానికులు సపర్యలు చేసి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే ఏ ఒక్క ఆటో కూడా ఆపకుండా వెళ్లిపోయారు.
రోడ్డుప్రమాదం