శుక్రవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న కూలీల ఆటో రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో ఆరుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిలో కూలి పనులుకు వెళ్లి తిరిగి గోరంట్ల వస్తుండగా గుంటూరు నుంచి వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వద్ద ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోడ్డుప్రమాదంలో మహిళ మృతి.. ఆరుగురి గాయాలు - guntur
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో మహిళ మృతిచెందగా, ఆరుగురి గాయాలయ్యాయి.
రోడ్డుప్రమాదం