గుంటూరు జిల్లాలో రెండు ద్విచక్రవాహనాలు ఢీ...ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా కాకుమాను వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు జిల్లా కాకుమాను వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పెదనందిపాడుకు చెందిన కాకుమాను మణికంఠ (19), షేక్ సమీర్, కాలీషాలు కొండపాటూరు నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. అదే సమయంలో అప్పాపురానికి చెందిన మనోజ్, జోషీలు మరో వాహనంపై వస్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. పెదనందిపాడుకు చెందిన మణికంఠ అక్కడికక్కడే మృతి చెందగా...అప్పాపురం గ్రామానికి చెందిన మనోజ్ ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో క్షతగాత్రుడు జోషిని మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. పెదనందిపాడుకు చెందిన మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బాపట్ల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ పై అంబులెన్స్ వరకు తరలింపు....
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్, జోషిని కాకుమానులోని అంబులెన్స్ వరకు స్థానికులు బైక్‌పై తరలించారు. అంబులెన్స్‌లో డ్రైవర్ మాత్రమే ఉండగా.. ఆయనను క్షతగాత్రులను బాపట్ల ఆసుపత్రికి తరలించారు.
ఇదీచదవండి