గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని పమిడిమర్రు గ్రామానికి చెందిన మురికిపూడి ఏసమ్మ.. గుంటూరులోని ప్రైవేట్ కాలేజీలో విద్యనభ్యసిస్తోన్న తన కుమార్తె పెరమ్మను తీసుకొచ్చేందుకు నగరానికి వెళ్లింది. కుమారుడుకి వృత్తి రీత్యా కుదరక అతని స్నేహితుడు బాబునాయక్ను తీసుకుని ద్విచక్రవాహనంపై గుంటూరు వెళ్లారు. కొంతసేపటి తరువాత పెరమ్మను వెంట తీసుకుని వీరు గ్రామానికి బయలుదేరారు. మండలంలోని జొన్నలగడ్డ చేరుకునే సమయానికి ఆటోను తప్పించే క్రమంలో ఎదురుగా నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఘటనలో తల్లి ఏసమ్మ అక్కడికక్కడే మృతి చెందగా... బాబునాయక్, పెరమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా బాబునాయక్ మార్గమధ్యలో మృతి చెందారు. పెరమ్మను స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.
కుమార్తెను కాలేజీ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా తల్లి మృతి - mother
ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న కుమార్తెను సెలవు రోజున ఇంటికి తీసుకువస్తుండగా ప్రమాదం జరిగి తల్లి మృతి చెందగా.. కుమార్తె తీవ్ర గాయాలయ్యాయి. వీరికి తోడుగా వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఘటనాస్థలం
మృతుల్లోని బాబునాయక్ మాచర్ల మండలంలోని ఉప్పలపాడు గ్రామవాసి అని ఎసమ్మ కుమారుడు తెలిపాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.