గుంటూరు జిల్లాలో కొవిడ్ విలయతాండవం చేస్తోంది. శనివారం రికార్డు స్థాయిలో 903 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క గుంటూరు నగరంలోనే 379 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారాలు వెల్లడించారు. తాడేపల్లి 76, మంగళగిరి 67, నరసరావుపేట 67, తెనాలి 50, పిడుగురాళ్ల 23, పెద్దకాకాని 16, తుళ్లూరు 18, తాడికొండ 12, బాపట్ల 11, చేబ్రోలు 11 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా కేసులతో గుంటూరు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 85 వేల 766కి చేరుకుంది. జిల్లాలో ప్రస్తుతం 4,301 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. కరోనాతో ఇవాళ ఒకరు మృతి చెందగా..మొత్తం మృతుల సంఖ్య 690 కి పెరిగింది. జీజీహెచ్, తెనాలి ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు కొవిడ్ కేర్ సెంటర్లు రోగులతో నిండిపోయాయి. ఆసుపత్రిలో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో కొవిడ్ బారిన పడినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.