'తెదేపాను గెలిపిస్తే అరవింద్‌కు వైద్యారోగ్య శాఖ' - mp
తెదేపాకు వెన్నెముకైన బీసీలు... కీలక సమయంలో మరోసారి తమ సహకారం అందించాలి. నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ అరవింద బాబును గెలిపించుకోవాలి. తెదేాపా మళ్లీ అధికారంలోకి వస్తే ఆయనకు వైద్యారోగ్య శాఖ మంత్రి పదవి వచ్చేలా ముఖ్యమంత్రిని ఒప్పిస్తా. -రాయపాటి
పేదల సంక్షేమానికి కృషి చేసే చంద్రబాబు ప్రభుత్వానికి బీసీలు అండగా నిలవాలని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కోరారు. తొలి నుంచీ బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్న రాయపాటి.... కీలక సమయంలో మరోసారి తమ సహకారం అందించాలని వారిని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.... నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ అరవింద బాబును గెలిపించుకోవాలని.... ఆయనకు వైద్యారోగ్య శాఖ మంత్రి పదవి వచ్చేలా ముఖ్యమంత్రిని ఒప్పిస్తానని చెప్పారు. రాష్ట్ర జనాభాలో మొదటిస్థానంలో ఉన్న బీసీలు తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని సాంబశివరావు కోరారు.