ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 31, 2021, 9:03 PM IST

ETV Bharat / state

'కరోనా సమయంలో చనిపోయిన రేషన్ డీలర్లకు ఎక్స్​గ్రేషియా ఇవ్వాలి'

రేషన్ డీలర్ల వృత్తి భద్రతకు సంబంధించి డీలర్ల స్టాక్ లిస్ట్, రేషన్ డీలర్ల స్టాక్ పాయింట్లుగా గుర్తిస్తామని ఏడాది క్రితం అసెంబ్లీలో మంత్రి ఇచ్చారని రేషన్ డీలర్ల అధ్యక్షులు లీల మాధవ్ రావు గుర్తు చేశారు. ఆ హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.

రేషన్ డీలర్ల అధ్యక్షులు లీల మాధవ్ రావు
రేషన్ డీలర్ల అధ్యక్షులు లీల మాధవ్ రావు

రాష్ట్రంలో ఉన్న 29 వేల మంది డీలర్లు... కరోనా సమయంలో 8 విడతల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన పంపిణీ బకాయిలు 175 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. కృతజ్ఞతగా రేషన్ డీలర్ల అధ్యక్షులు లీల మాధవ్ రావు... ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. చనిపోయిన డీలర్లకు ఎక్స్ గ్రేషియా మంజూరు చేయాలని కోరారు. రేషన్ డీలర్ల వృత్తి భద్రతకు సంబంధించి డీలర్ల స్టాక్ లిస్ట్, రేషన్ డీలర్ల స్టాక్ పాయింట్లుగా గుర్తిస్తామని ఏడాది క్రితం అసెంబ్లీలో మంత్రి చెప్పారన్నారు.

ఆ హమీకి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ పంపిణీకి వాహనదారులను పెట్టారు కానీ... వారి వల్ల ముఖ్యమంత్రి ఆశయం నెరవేరలేదని అభిప్రాయపడ్డారు. అధికారులు సైతం పథకం విజయవంతం అయిందీ లేనిదీ పారదర్శకంగా చెప్పాలని కోరారు. 9260 వాహనాలు ఉంటే 14 వేల రేషన్ షాపులు ఎలా తెరుస్తున్నారు అనేది... అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details