ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హలో.. సీఎం పీఏను మాట్లాడుతున్నా.. 3 లక్షలు ఇవ్వండి' - in

అతను విద్యావంతుడు.. మంచి క్రికెటర్. పేద కుటుంబం నుంచి వచ్చినా తన ప్రతిభతో రంజీల్లో ఆడే స్థాయికి ఎదిగాడు. గతంలో 82 గంటలపాటు మ్యాచ్ ఆడి గిన్నిస్ బుక్​లో చోటూ సంపాదించాడు. ఎన్నుంటేనేం.. ఒక చెడ్డ ఆలోచన కటకటాల పాల్జేసింది.

హలో.... సీఎం పీఏను మాట్లాడుతున్నా... నాగరాజుకు 3 లక్షలు ఇవ్వండి...

By

Published : Jul 16, 2019, 1:18 AM IST

హలో.... సీఎం పీఏను మాట్లాడుతున్నా... నాగరాజుకు 3 లక్షలు ఇవ్వండి...

శ్రీకాకుళం జిల్లా పొలంగి మండలం యవ్వరిపేటకు చెందిన బుడుమూరి నాగరాజు క్రికెటర్‌. అతను ఈనెల 11న గుంటూరు హ్యాపీ మొబైల్స్ యజమాని సంతోష్ కుమార్​కు ఫోన్ చేశాడు. తాను ముఖ్యమంత్రి పీఏ నని పరిచయం చేసుకున్నాడు. నాగరాజు అనే రంజీ ఆటగాడిని స్పాన్సర్ షిప్ కోసం పంపిస్తున్నాననీ... అతనికి 3 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. అది నిజమే అని నమ్మిన సంతోష్... డబ్బులు సిద్ధం చేసుకున్నాడు. పరిచయస్థులకు విషయం చెప్పగా వారు.. సీఎం పీఏను సంప్రదించారు. విషయంపై ఆరాతీశారు. తానెవరినీ పంపించలేదనీ.. ఆ ఫోన్ కాల్​కు, తనకూ ఎలాంటి సంబంధం లేదని ఆయన సమాధానం ఇచ్చారు. అప్పుడు విషయం అర్థమై.. సంతోష్ పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో... నాగరాజే అసలు నిందితుడని తేలింది. గతంలోనూ అతను ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details