పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను కల్పించటంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని గుంటూరు జిల్లా సంయుక్త పాలనాధికారి హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో రంజాన్ మాసంలో ప్రజలకు సదుపాయాల కల్పనపై అనుబంధ శాఖలతో సమావేశమయ్యారు. గత సంవత్సరం అన్నిచోట్ల ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు, పండుగ జరిగేలా చర్యలు చేపట్టామని... ఈ ఏడాది కూడా అదే తరహాలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మే 6 నుంచి జూన్ 6 వరకు మసీదుల వద్ద ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు.
రంజాన్ మాసంలో ప్రజలకు సదుపాయాల కల్పనపై కలెక్టర్ సమావేశం - sub collector
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను కల్పించాలని, అందుకోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని గుంటూరు జిల్లా సంయుక్త పాలనాధికారి హిమాన్షు శుక్లా తెలిపారు.
రంజాన్ ఏర్పాట్లు