ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉయ్యందనలో వైకాపా రిగ్గింగ్​కు పాల్పడిందని తెదేపా నేతల ఆందోళన

గుంటూరు జిల్లాలోని పలుచోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వైకాపా, తెదేపా నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఉయ్యందనలో అధికార పార్టీ వారు రిగ్గింగ్​కు పాల్పడుతున్నారని తెదేపా నేతలు ఆందోళన చేశారు. గారపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

quarreling between tdp, ycp leaders at uyyandhana, garapadu krishna district
ఎన్నికల్లో ఉద్రిక్తత

By

Published : Apr 8, 2021, 4:43 PM IST

ఎన్నికల్లో ఉద్రిక్తత

గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలో... జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్​కు పాల్పడ్డారని తెదేపా నేతలు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్నికల సిబ్బంది వద్ద ఉన్న జడ్పీటీసీ బ్యాలెట్ పత్రాల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఉండటంతో తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారుల తీరును నిరసించారు.

మరోవైపు గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడులో వైకాపా, తెదేపా నేతలు రెండు వర్గాలుగా ఏర్పడి ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.

ఇదీచదవండి.

గర్భవతి భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష

ABOUT THE AUTHOR

...view details