గుంటూరులో ట్రాఫిక్ సమస్యలపై వాట్సాప్ ఫిర్యాదులుకు ట్రాఫిక్ పోలీసులు వెంటానే స్పందిస్తున్నారు. మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ఇస్తే మాత్రం వాహన యజమాని శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. గుంటూరు కోరిటపాడు సెంటర్ లో AP07AT3293 ద్విచక్ర వాహనం నడుపుతున్న బాలుడిని స్థానికులు ఫోటో తీసి ట్రాఫిక్ డిఎస్పీ సెల్ నెంబర్‌కి వాట్సాప్ చేశారు. మైనర్‌లకు వాహనాలు ఇవ్వడం వలన ప్రమాదాలు జరుగుతాయని.. తల్లిదండ్రులు పడుతున్న మానసిక క్షోభ వివరించి కౌన్సిలింగ్ ఇచ్చారు. నగరంలో ఎక్కడైనా ట్రాఫిక్ మస్యలు తలెత్తిన కుర్రకారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన తమ దృష్టికి వస్తే తగిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డిఎస్పీ సుప్రజ తెలిపారు.
మైనర్‌లకు వాహనాలు ఇచ్చిన యజమానికి శిక్ష..! - డిఎస్పీ సుప్రజ
మైనర్‌లకు వాహనాలు ఇస్తే జాగ్రత్త.. మీ వాహనాలతోపాటు మీరూ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే స్థానికులూ చర్యలు తీసుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయి.
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే శిక్షలు