పులిచింతల జలాశయానికి వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. సాగర్ నుంచి వస్తున్న లక్షలాది క్యూసెక్కుల ప్రవాహంతో... పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయరును అధికారులు నింపారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా... ప్రస్తుతం 171 అడుగలకు నీటిమట్టం చేరింది. నీటి నిల్వ సామర్థ్యం దాదాపు 46 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 40 టీఎంసీల నీరు ఉంది. వరద స్థిరంగా కొనసాగుతుండగా.. బెల్లంకొండ మండలంలోని ముంపు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కృష్ణమ్మ ప్రవాహ ఉద్ధృతికి... మాదల నుంచి సూర్యాపేట జిల్లా బుగ్గల మాదారం వెళ్లే బల్లకట్టనూ నిలిపేశారు.
పులిచింతలకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి - water
పులిచింతలకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయాన్ని గరిష్ఠ సామర్థ్యం వరకూ... నింపుతున్నారు అధికారులు.
pulichinthala-water-flow