గుంటూరు జిల్లా ప్రత్రిపాడు సర్పంచి వనపర్తి రమాదేవి, వార్డు సభ్యులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వైకాపా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హోంమంత్రి మేకతోటి సుచరిత విజేతలను అభినందించారు. వారితో కలిసి ఆమె రెవెన్యూ కార్యాలయం నుంచి అంకమ్మ గడు, మల్లాయపాలెం కూడలి మీదుగా పంచాయతీ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. అనంతరం రమాదేవిని ఘనంగా సత్కరించారు. ఉప సర్పంచ్ బాపతు వెంకటేశ్వర రెడ్డితో పాటు వైకాపా నాయకులు గట్టు విజయ్, విప్పాల కృష్ణా రెడ్డి, సలాం, ఓం ప్రకాశ్ పాల్గొన్నారు.
ప్రత్తిపాడులో ఘనంగా విజయోత్సవ ర్యాలీ - guntur district newsupdates
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా మద్ధతుదారులు విజయం సాధించిన సందర్భంగా గుంటూరు జిల్లా ప్రత్రిపాడులో నిర్వహించిన ర్యాలీలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు విజయం సాధించిందని హోంమంత్రి అన్నారు.
ప్రత్తిపాడులో ఘనంగా విజయోత్సవ ర్యాలీ