సీఎం జగన్ గుంటూరులో ఏప్రిల్ 1న కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఈ క్రమంలో 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ తీసుకోనున్నారు.
అనంతరం కాసేపు వార్డు, సచివాలయంలోని ఉద్యోగులు, వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి మాట్లాడతారు. కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ ప్రశాంతి, అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు.