ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీధి దీపాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత.. గ్రామాల్లో అంధకారం

బకాయిలు చెల్లించడం లేదని విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కం) వీధి దీపాలకు సరఫరా నిలిపివేయడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంటోంది. పంచాయతీ ఖాతాల్లో నిధుల్లేక ఇప్పటికే అల్లాడుతున్న పలువురు సర్పంచులు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలలో 14,15వ ఆర్ధిక సంఘం నిధులను విద్యుత్తు బిల్లులు చెల్లించేందుకు తీసుకున్నామన్న ప్రభుత్వం.. డబ్బు కట్టకపోవడంతోనే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీధి దీపాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత
వీధి దీపాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత

By

Published : Jul 31, 2022, 5:40 AM IST

బకాయిలు చెల్లించడం లేదని విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కం) వీధి దీపాలకు సరఫరా నిలిపివేయడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంటోంది. బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో పలు పంచాయతీల్లో శుక్రవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సరఫరాను పునరుద్ధరించలేదు. వేమూరు, చుండూరు పంచాయతీల్లోనూ శనివారం సరఫరా ఆపేశారు. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలోని పలు పంచాయతీలకు ఇదే పరిస్థితి ఎదురైంది. తాగునీటి పథకాలూ పని చేయడం లేదు. పంచాయతీ ఖాతాల్లో నిధుల్లేక ఇప్పటికే అల్లాడుతున్న పలువురు సర్పంచులు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన 14, 15 ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద రాష్ట్ర ప్రభుత్వం 2 విడతలుగా రూ.1,245 కోట్లు మళ్లించిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో సర్పంచులకు ఏ సమాచారం ఇవ్వలేదు.

తాజాగా 2021-22 సంవత్సరానికి సంబంధించి రెండో విడత, 2022-23లో తొలి విడత కలిపి రూ1,000 కోట్లకు పైగానే 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం త్వరలో విడుదల చేయనుంది. గతంలో మాదిరిగా ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించే అవకాశం లేదు. గ్రామ పంచాయతీల పేరుతో ఇటీవల తెరిచిన బ్యాంకు ఖాతాలకు కేంద్రం ఈ నిధులను జమ చేయనుంది. ఈ ఖాతాలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (పీఎఫ్‌ఎంఎస్‌)కి అనుసంధానించారు. ఈ నేపథ్యంలో మిగిలిన బకాయిల వసూళ్ల కోసం డిస్కంలు విద్యుత్‌ సరఫరా నిలిపివేత చర్యలకు దిగుతోంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో విద్యుత్తు పంపిణీ సంస్థకు ప్రభుత్వశాఖలు రూ.359.38 కోట్లు బకాయి పడ్డాయి. వీటిలో గ్రామ పంచాయతీలు రూ.124.27 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల నుంచి రూ.3,895 కోట్లు బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తొలుత బాపట్ల, గుంటూరు జిల్లాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేతకు శ్రీకారం చుట్టింది. దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. పంచాయతీల్లో నిధుల లేమితో ఇటు విద్యుత్తు బకాయిలు చెల్లించలేక... అటు ప్రజలకు సమాధానం చెప్పలేక సర్పంచులు మరింత ఇబ్బంది పడుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details