Nik Vujicic met CM Jagan: ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్.. ముఖ్యమంత్రి వైయస్. జగన్‌ను కలిశారు.. ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రిని కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు నిక్ తెలిపారు.. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు ఆర్.ధనుంజయ్‌రెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.
దాదాపు 78 దేశాల్లో తాను పర్యటించానని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదన్నారు. ఆయన అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నారన్నారు. ఏపీలో సుమారు 45వేల ప్రభుత్వ స్కూళ్లను ఏ ప్రైవేటు స్కూళ్లకు తీసిపోనిరీతిలో అందరికీ సమాన ఆవకాశాలు కల్పించాలన్న.. గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు.