ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోడపై వివాదం.. పొనుగుపాడులో 144 సెక్షన్‌ - tdp

పొనుగుపాడులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడపై వివాదం నెలకొన్న క్రమంలో.. ఈ గోడను పరిశీలించేందుకు తెలుగుదేశం పార్టీ నిజనిర్ధరణ కమిటీ పొనుగుపాడులో పర్యటించింది. ఉద్రిక్తతలు పెరగకుండా.. పోలీసులు అడ్డుకున్నారు.

ponugupadu-wall-issue-144-section

By

Published : Jul 27, 2019, 11:45 AM IST

Updated : Jul 27, 2019, 11:58 AM IST

గోడపై వివాదం.. పొనుగుపాడులో 144 సెక్షన్‌

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో... తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, బచ్చుల అర్జునుడు, మద్దాల గిరిధర్‌, జీవీ ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. నరసారావుపేట పోలీస్‌స్టేషన్‌కు పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని... గ్రామం వెలుపలే పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు చర్చలు అనంతరం... ఆంక్షలు విధిస్తూ గ్రామాల్లోకి ఉద్రిక్తపరిస్థితులు నివారించేందుకు పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. గ్రామంలోని చర్చి సమీపంలో రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించడంపై గతంలో వివాదం చెలరేగింది. ఈ గోడను పరిశీలించేందుకు తెలుగుదేశం పార్టీ నిజనిర్ధరణ కమిటీ పొనుగుపాడులో పర్యటిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని... ఘర్షణలు చెలరేగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సుమారు 100 మంది పోలీసులు గ్రామంలో పహారా కాస్తున్నారు.

Last Updated : Jul 27, 2019, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details