పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్‌ను స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పోలీసులు వినియోగించే అత్యాధునిక ఆయుధాలను ప్రజలకు చూపించి.. వాటి గురించి వివరించారు.
ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, పిస్టల్, రివాల్వర్, బాష్పవాయు గోళాలు వినియోగించే తుపాకీ, ల్యాండ్ మైన్స్‌ను కనిపెట్టే పరికరాలు, నేరం జరిగిన సమయంలో ఆధారాల కోసం సేకరించే వేలిముద్రల పరికరాలను హౌస్‌లో ప్రదర్శనకు ఉంచారు. వీటిలో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న పిస్టల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజలు ప్రశాంతంగా ఇళ్లల్లో నిద్రపోతున్నారంటే పోలీసులే కారణమని.. వారు చేసే త్యాగాలు ఎంతో విలువైనవని ఆర్కే కొనియాడారు.