ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండో రోజు సీఐడీ విచారణకు వెంకటేశ్​.. పోలీసుల భారీ బందోబస్తు

CID: "ఐ తెదేపా" కో-ఆర్డినేటర్ వెంకటేశ్​ను సీఐడీ అధికారులు విచారణకు పిలిపించారు. ఆర్థిక ఇబ్బందులతో "అమ్మఒడి", "వాహనమిత్ర" పథకాలు రద్దు చేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఆయనను విచారించేందుకు రమ్మన్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

1
రెండో రోజు సీఐడీ విచారణకు హాజరుకానున్న వెంకటేష్

By

Published : Jun 3, 2022, 2:51 PM IST

CID:"ఐ తెదేపా" కో-ఆర్డినేటర్ వెంకటేశ్​ను సీఐడీ అధికారులు విచారణకు పిలిపించారు. ఈ నేపథ్యంలో.. గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారనే అభియోగంపై వెంకటేశ్​ను విచారణ నిమిత్తం పిలిచారు. ఆర్థిక ఇబ్బందులతో అమ్మఒడి, వాహనమిత్ర పథకాలు రద్దు చేశారంటూ... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అభియోగాలు వెంకటేశ్​పై నమోదయ్యాయి.

నిన్న విచారణ సమయంలో సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరుపై.. వెంకటేశ్‌ అసహనం వ్యక్తం చేశారు. "కార్యకర్తలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేస్తే వస్తానని లోకేశ్ అంటుంటారు కదా.. ఇప్పుడు చేయండి వస్తారేమో చూద్దాం" అని సీఐడీ అధికారులు అన్నారని వెంకటేశ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. రెండో రోజు విచారణకు వెంకటేశ్ హాజరవుతున్న నేపథ్యంలో.. సీఐడీ తీరును నిరసిస్తూ తెదేపా శ్రేణులు సీఐడీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో.. వారిని అరెస్టు చేసి నల్లపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు.

రెండో రోజు సీఐడీ విచారణకు హాజరుకానున్న వెంకటేష్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details