గుంటూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య జఠిలం కావటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు తోపుడు బండ్లు, టిఫిన్ వాహనాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. నగరంలోని ప్రధాన కూడళ్లు అయిన హరిహరమహల్, కోరిటిపాడు సెంటర్, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్, అమరావతి రోడ్డులోని ఆక్రమణలను తొలగించారు. ఎవరైనా ప్రయాణికులకు, రవాణాకు ఆటంకం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐ వాసు హెచ్చరించారు.
గుంటూరులో ట్రాఫిక్ సమస్యకు పోలీసుల చర్యలు - traffic police responds on traffic
గుంటూరు నగరంలో నిరంతర రద్దీతో ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు పోలీసు యంత్రాంగం అడ్డువచ్చిన తోపుడు బండ్లు, టిఫిన్ వాహనాలను తొలగించే చర్యలు చేపట్టింది. ఇక మీదట ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐ వాసు తెలిపారు.
ట్రాఫిక్ సమస్యకు పోలీసుల చర్యలు