బాలికపై సహ విద్యార్థి అత్యాచారం
తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై సహ విద్యార్థి అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అత్యాచారం
గుంటూరు జిల్లా నరసరావుపేటలో బాలికపై సహ విద్యార్థి అత్యాచారం చేశాడంటూ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. పట్టణంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో చదువుతున్న మరో విద్యార్థి అత్యాచారం చేశాడంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వైద్యశాలకు తరలించారు.