ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా అభ్యర్థి ఇంట్లోని మద్యం.. ఆ దుకాణంలోనిదే - latest news on local body elections in ap

గుంటూరు జిల్లా తెనాలిలో శుక్రవారం తెల్లవారుజామున తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థి ఇంట్లో దొంగచాటుగా పెట్టిన మద్యం సీసాలు ఏ దుకాణాలోనివో పోలీసులు గుర్తించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణంలోనివని నిర్ధారించారు.

police found liquor bottles in tdp candidate from were it has come
తెదేపా అభ్యర్థి ఇంట్లోని మద్యం.. ఆ దుకాణంలోనిదే

By

Published : Mar 14, 2020, 10:43 AM IST

Updated : Mar 14, 2020, 10:53 AM IST

తెదేపా అభ్యర్థి ఇంట్లోని మద్యం.. ఆ దుకాణంలోనిదే

గుంటూరు జిల్లా తెనాలిలో శుక్రవారం తెల్లవారుజాము తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థి ఇంట్లో దొంగచాటుగా పెట్టిన మద్యం సీసాలు స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణానికి చెందినవని తెనాలి పోలీసులు గుర్తించారు. సాంకేతిక అంశాల ద్వారా ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు దుకాణం సూపర్‌వైజర్‌ మాధవరావును అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వరరావు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సీసాల కేసును ఎవరికి విక్రయించారనేదానిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Last Updated : Mar 14, 2020, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details