ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రవాణాకు సిద్ధంగా ఉన్న మిర్చి లారీ చోరీ.. కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Jun 6, 2021, 3:36 PM IST

గుంటూరూ జిల్లా నల్లపాడు పోలీసులు మిర్చి లారీ చోరీ కేసును ఛేదించారు. చోరీకి గురైన రూ.20 లక్షల విలువైన మిర్చి బస్తాలు, లారీని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా గతనెల 29న రవాణాకు సిద్ధంగా ఉన్న లారీ చోరీకి గురైంది.

lorry theft case reveal
lorry theft case reveal

గుంటూరు మిర్చి యార్డు వద్ద లోడుతో ఉన్న లారీ చోరీకి గురైన కేసును నల్లపాడు పోలీసులు ఛేదించారు. గత నెల 29న 20లక్షల విలువైన మిర్చి ఉన్న లారీని దుండగులు అపహరించగా.. ప్రధాన నిందితుడు శ్రావణ్‌కుమార్ సహా ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేశారు. వారి వద్ద 239 మిర్చి బస్తాలు, లారీని స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు ఎగుమతికి సిద్ధంగా ఉన్న లారీని శ్రావణ్‌కుమార్ అపహరించగా... మరో ఇద్దరు మిర్చి బస్తాల విక్రయానికి సహకరించారని అర్బన్ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details