ఎమ్మెల్యేలపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. వ్యక్తిపై కేసు నమోదు - mlas
మహిళా ఎమ్మెల్యేలపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పునుగుపాటి రమేష్‌పై.. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యేలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు
శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల ఫొటో క్లిప్పింగ్‌ను రమేష్ అనే వ్యక్తి... ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరంగా పోస్టు చేశాడని అసెంబ్లీ కార్యదర్శి తుళ్లూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి తీరును.. సభాపతి తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాల మేరకు.. అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు చేయగా.. సైబర్ క్రైం, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు దాఖలైంది.