తెదేపా నాయకుడు ఉమాయాదవ్ హత్యకేసులో 12 మంది నిందితులను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆధిపత్య పోరు కారణంగానే.. ఈ హత్య జరిగినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
వీడిన తెదేపా నేత హత్య కేసు మిస్టరీ - మంగళగిరి
గుంటూరు జిల్లా మంగళగిరిలో సంచలం సృష్టించిన తెదేపా నేత తాడిబోయిన ఉమాయాదవ్ హత్య కేసు చిక్కుముడి వీడింది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
రిపోర్టులో ఏముందంటే...
ఉమా యాదవ్ హత్యకేసులో తెదేపా నేతలు ఏనుగు కిషోర్, చావలి ఉల్లయ్య, నల్లగొర్ల శ్రీనివాసరావు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 'ప్రధాన నిందితుడు తోట శ్రీనివాసరావు... ఉమాయాదవ్ మధ్య కొంత కాలం ఆధిపత్య పోరు నడిచింది. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఉమాయాదవ్ ముందు ఉంటున్న పరిస్థితుల్లో.. క్రమంగా తోట శ్రీనివాసరావు పలుకుబడి తగ్గింది. ఇది మనుసులో పెట్టుకున్న శ్రీనివాసరావు ఎలాగైనా ఉమాయాదవ్ ను హత్యచేయాలని భావించాడు. ఈ నేపథ్యంలో ఇతరుల సాయం తీసుకున్నాడు' అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు.