గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులోని అంకమ్మ, పోలేరమ్మ తల్లుల తిరునాళ్ళు వైభంగా జరుగుతున్నాయి. అమ్మవార్లకు 108 బిందెల పసుపు నీళ్ల అభిషేకం చేశారు. అమ్మవార్లకు ముప్పవరపు వరప్రసాద్, విజయలక్ష్మి దంపతులు మల్లెపూలను సమర్పించారు. అనంతరం మల్లెపూలతో అంకమ్మ, పోలేరమ్మలకు పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవార్ల దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.
వైభవోపేతంగా కొమ్మూరు అంకమ్మ, పోలేరమ్మ తిరునాళ్లు - పోలేరమ్మ
కొమ్మూరు అంకమ్మ, పోలేరమ్మ తల్లుల జాతర వైభంగా జరుగుతోంది. ఆదివారం రాత్రి అమ్మవార్లకు పసుపు అభిషేకాలు, మల్లెపూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, మొక్కులు తీర్చుకున్నారు.
కొమ్మూరు అంకమ్మ, పోలేరమ్మ తిరునాళ్లు