ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక అనేక సహసోపేతమైన నిర్ణయాలతో,సుపరిపాలన అందిస్తున్నారని భాజపా నేత రావెల కిషోర్ బాబు అన్నారు.మోదీ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా,అమరావతిలోని హిందూ ఫార్మసీ కళాశాలలో ప్రధాని విశేషాలను తెలియచేస్తూ ఫోటో ఎగ్జిబిషన్ లో ఆయన పాల్గొన్నారు.అవినీతి రహిత పాలన పట్లా యావత్తు ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోందని రావెల చెప్పారు.ఆర్టికల్370రద్దు,తలక్ వంటి బిల్లులతో మోదీ ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఆకట్టుకున్న మోదీ ఫొటో ఎగ్జిబిషన్ - ప్రధాని జన్మదినోత్సవం సందర్భంగా..ఫోటో ఎగ్జిబిషన్
గుంటూరు అమరావతిలో హిందూ ఫార్మసీ కళాశాలలో ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో భాజపా నేత రావెల కిషోర్ బాబు తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.
ప్రధాని జన్మదినోత్సవం సందర్భంగా..ఫోటో ఎగ్జిబిషన్