గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల సమీపంలో ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది తీవ్ర గాయాలైన అతడిని బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
రైలు నుంచి జారిపడ్డ వ్యక్తి.. తీవ్రగాయాలు - అప్పికట్ల
రైలు నుంచి ఓ వ్యక్తి జారిపడి తీవ్రగాయాలైన ఘటన గుంటూరు జిల్లా అప్పికట్ల సమీపంలో జరిగింది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు