ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎస్సై బెదిరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు..!

ఏదైనా సమస్య వస్తే.. పోలీసులు సాయం కోరుతాం... మరి ఆ పోలీసే సమస్యగా మారితే ఎక్కడి వెళ్లాలి.. ఇది ఓ యువకుడి పరిస్థితి. ఆస్తి తగాదా కేసులో గుంటూరు జిల్లా తాడికొండ పోలీసు స్టేషన్​కు వెళ్లిన స్థానికుడు సాగర్​బాబును.. సమస్య పరిష్కరించాలంటే ఎంత ఇస్తావ్ అని అడుగుతున్నారని బాధితుడు వాపోతున్నారు.

By

Published : Dec 9, 2019, 10:34 PM IST

Published : Dec 9, 2019, 10:34 PM IST

person complaint on tadikonda si to sp
ఎస్సై బెదిరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు..!

మాట్లాడుతున్న బాధితుడు సాగర్ బాబు
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు గ్రామానికి చెందిన సాగర్ బాబు విజయవాడలోని ఓ వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసించారు. తన తండ్రి చిన్నప్ప మానసిక ఒత్తిడికిలోనై 2001లో ఆత్మహత్య చేసుకున్నారని సాగర్ తెలిపారు. ఆ తర్వాత తల్లి కూడా అనారోగ్యంతో మృతి చెందారని చెప్పారు. చిన్నప్ప ఆస్తిపై కన్నేసిన సాగర్ మేనమామ రమేష్ పాములుపాడు ఉన్న స్థలాన్ని ఆక్రమించారని బాధితుడు వాపోతున్నాడు. ఈ విషయంపై తాడికొండ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తే న్యాయం చేయకుండా..రాజీ కుదుర్చుకోమని బెదిరిస్తున్నారని వాపోయారు. 'నువ్వు కేసు పెట్టినవాళ్లు నాకు డబ్బులిచ్చారు. నువ్వు ఎంత ఇస్తావో చెప్పు...' అని ఎస్సై బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మేనమామ రమేష్ నుంచి ప్రాణహాని ఉందని, తన ఆస్తిని అప్పగించాలని కోరుతూ అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details