గుంటూరు జిల్లా రాయపూడిలో రేపటి రాజధాని రైతుల ర్యాలీ, సభకు డీఐజీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ విశాల్ గున్నీ అనుమతిచ్చారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా నిరసన చేపడితే అడ్డుకోమని డీఐజీ తెలిపారు. కొందరు అల్లరిమూకలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నందున... అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
నిబంధనలు పాటించాలి..
గుంటూరు జిల్లాలో తలపెట్టిన రేపటి రాజధాని రైతుల ర్యాలీ, సభను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని ఎస్పీ విశాల్ గున్నీ కోరారు. ఇతర జిల్లాల నుంచి ఎవరినీ సమీకరించొద్దని సూచించారు. రైతులు శాంతియుతంగా సభ ముగించుకోవాలని కోరారు. ఉదయం 11 నుంచి సా.4 గంటల వరకు మాత్రమే సభకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రసంగించేటప్పుడు రైచ్చగొట్టే విధంగా మాట్లాడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదని ఎస్పీ విశాల్ గున్నీ హెచ్చరించారు. ఈ సభకు పోలీసుల సహకారం ఉంటుందన్న ఎస్పీ... ట్రాఫిక్, బందోబస్తుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. కరకట్టపై వీఐపీలు, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.
ఇదీచదవండి.