దేశ, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షడు కన్నాలక్ష్మీనారాయణ తెలిపారు. మోదీ దేశానికి అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు ఆకర్షితులై భాజపాలోకి చేరుతున్నారని తెలిపారు. ఈ నెల 6న ప్రారంభించిన సంఘటన్ పర్వ్ - 2019 సభ్యత్వ నమోదు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా.. రాష్టానికి తాము అన్యాయం చేస్తున్నామని కొందరు విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మోదీ విధివిధానాలను ప్రజలు అర్థం చేసుకుని దిల్లీ నుండి గల్లీ వరకు పార్టీలోకి వలసలు వస్తున్నారని వెల్లడించారు. తాము ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నామని ఆరోపణలు చేయటం సరికాదన్నారు. అటువంటి ఆరోపణలు చేసే వారి మాటలను పరిగణలోకి తీసుకొమన్నారు.
మోదీ పాలనకు ఆకర్షితులై భాజపాలోకి చేరికలు: కన్నా - guntur
ప్రధాని మోదీ అందిస్తున్న పాలనకు ప్రజలు ఆకర్షితులై భాజపాలో చేరుతున్నారని రాష్ట్రా భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
కన్నాలక్ష్మీనారాయణ