ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్ల తొలగింపుపై సబ్ కలెక్టర్​కు గ్రామస్థుల వినతి - నరసరావుపేట తాజా వార్తలు

ఓటు వేయలేదని అధికారపార్టీ నాయకులు తమ పింఛన్లను తొలగించారని నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామస్థులు ఆరోపించారు. తమ పింఛన్లు ఇప్పించాలంటూ సబ్ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. కేవలం ఒక పార్టీకి అనుకూలంగా ఓటు వేశారనే నెపంతో పింఛన్లు తొలగించడంపై వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

pensions removed
సబ్ కలెక్టర్​కు గ్రామస్థుల వినతిపత్రం

By

Published : Mar 2, 2021, 3:49 PM IST

నరసరావుపేట మండలం పమిడిపాడులో పింఛన్లు తొలగించారంటూ నరసరావుపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జనసేన సభ్యులు మంగళవారం నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ సబ్ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో జనసేన మద్దతుదారుడు విజయం సాధించారని ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్​ సయ్యద్ జిలాని తెలిపారు.

దీనిని జీర్ణించుకోలేని కొందరు అధికారపార్టీ నాయకులు గ్రామంలో జనసేన వర్గీయులకు పింఛన్లను తొలగించారని ఆయన ఆరోపించారు. గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి పింఛన్లు పొందుతున్న వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లను తొలగించారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయమై నరసరావుపేట సబ్ కలెక్టర్, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.

సబ్ కలెక్టర్​కు గ్రామస్థుల వినతిపత్రం

ఓటు వేయకుంటే తీసేస్తారా: సర్పంచ్​ షేక్​ గౌసియా బేగం

ఓట్లు వేయనంత మాత్రాన వృద్ధుల పింఛన్లు తొలగించడం సరికాదని నూతన సర్పంచి షేక్ గౌసియా బేగం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై వాలంటీర్​ను ప్రశ్నించగా తమ చేతుల్లో ఏమీ లేదని, అధికార పార్టీ పెద్దలను కలసి మాట్లాడుకోమని చెబుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అధికారులు స్పందించి గ్రామస్థులకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

వృద్ధుల ఆగ్రహం..

అధికారుల తీరుపై వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం వచ్చి వేలి ముద్రులు వేయించుకుని వెళ్లారని, సాయంత్రం డబ్బులు ఇస్తామని చెప్పి రాకపోవడంతో తామే వారి వద్దకు వెళ్లామని అన్నారు. డబ్బు రాలేదని.. అధికారపార్టీ పెద్దల వద్దకు వెళ్లి మాట్లాడుకోండంటూ వాలంటీర్లు సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని పింఛను దారులు కోరారు.

ఇదీ చదవండి:'నిజంగానే అభివృద్ధి చేస్తే.. వైకాపా ఎందుకు భయపడుతోంది?'

ABOUT THE AUTHOR

...view details