గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గోగులపాడులో పేకాటరాయుల మధ్య వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. పేకాటలో దుర్గారావు అనే వ్యక్తికి పోతురాజు ఇవ్వాల్సిన 2 వేల 500 రూపాయల విషయంలో వివాదం తలెత్తింది. వారి మద్దతుదారుల మధ్య ఘర్షణకు దారితీసింది.
తెల్లవారుజామున పోతురాజు వర్గానికి చెందిన సుమారు 20 మంది.... తమ కుటుంబీకులపై కర్రలతో దాడి చేశారని దుర్గారావు కుటుంబీకులు ఆరోపించారు. గృహోపకరణాలు, ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారని బాధితురాలు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.... గొడవకు దారితీసిన పరిస్థితులను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.
పేకాట అప్పు.. 2500 కోసం ఇరు వర్గాల ఘర్షణ - godava
పేకాటలో 2,500 ఇవ్వలేదని ఇద్దరి వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో 8 మందికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గోగులపాడులో ఈ ఘటన జరిగింది.
కొంప కూల్చిన పేకాట... 2500 కోసం గొడవ
ఇదీ చదవండి