ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫీజులు వసూలు చేశారు.. తరగతులు మరిచారు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ప్రైవేటు కళాశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నీట్​లో సీటు గ్యారంటీ పేరుతో.. కళాశాల యాజమాన్యం నగదు తీసుకుని తరగతులు నిర్వహించలేదని ఆరోపించారు. వెంటనే యాజమాన్యం స్పందించి తరగతులు నిర్వహిస్తామని హామీ ఇవ్వటంతో తల్లిదండ్రులు వెనుదిరిగారు.

By

Published : Mar 7, 2021, 8:13 PM IST

parents protest at private college in mangalagiri for not helding classes after collecting fees
నగదు వసూలు చేసి తరగతులు నిర్వహించటం లేదని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ప్రైవేటు కళాశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నీట్​లో సీటు గ్యారంటీ పేరుతో.. సంవత్సరం క్రితం ఒక్కో విద్యార్థి వద్ద రూ.5 లక్షలు తీసుకొని లాంగ్ టర్మ్ శిక్షణ ఇచ్చారని.. ఈ ఏడాది ఒక్క తరగతి కూడా నిర్వహించలేదని ఆరోపించారు. నీట్​లో సీటు రాకపోతే విద్యార్థి నుంచి తీసుకున్న డబ్బులో సగం తిరిగి చెల్లిస్తామని.. కళాశాల యాజమాని గురుబ్రహ్మం హామీ ఇచ్చారని వారు తెలిపారు.

తమ పిల్లలకు సరైన భోజనం అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. సోమవారం నుంచి అన్ని తరగతులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details