ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పల్నాడు ప్రశాంతంగా ఉంది...కావాలంటే చర్చకు రండి' - mla

ప్రతిపక్ష నేత చంద్రబాబు చెబుతున్నట్లు పల్నాడులో అరాచాకాలు, అక్రమాలు జరగటం లేదని ప్రశాంతంగా ఉందని గురజాల శాసనసభ్యలు కాసు మహేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడి పరిస్థితిపై బహిరంగ విచారణకు సిద్ధమని తెదేపా నేతలు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.

కాసు మహేశ్ రెడ్డి

By

Published : Aug 27, 2019, 9:50 PM IST

కాసు మహేశ్ రెడ్డి

పల్నాడులో ప్రశాంత వాతావరణం ఉందని.... ప్రతిపక్ష నేత చంద్రబాబు చెబుతున్నట్లు అరాచకాలు జరగడం లేదని గురజాల వైకాపా ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి వ్యాఖ్యనించారు. గత ప్రభుత్వ పాలనలో పల్నాడులో జరిగిన అక్రమాలు, అన్యాయాలు తెదేపా అధిష్ఠానం మర్చిపోయినట్లుందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం వైకాపాల ఆధ్వర్యంలోనే పల్నాడు అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. పల్నాడులో సామాన్య ప్రజలు ఎక్కడికీ వెళ్లడం లేదని... అక్రమాలు, అరాచకాలకు పాల్పడినవారే ఆందోళన చెందుతున్నారన్నారు. ఇక్కడి పరిస్థితిపై బహిరంగ విచారణకు తాము సిద్ధమని.... తెదేపా నేతలు సైతం ఇందుకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. గురజాలలో అక్రమ మైనింగ్పై హైకోర్టు తీర్పు వెలువడాల్సి ఉందన్న మహేశ్ రెడ్డి.... ధర్మమే గెలుస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details