ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ సభలో ప్రమాదం.. విద్యుత్​షాక్​తో ఒకరి మృతి - ఒకరు

ఇటీవల వైకాపా అధినేత జగన్ ప్రచార సభలో పిట్టగోడ కూలిన ఘటన మరిచిపోకముందే.. అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. సోమిరెడ్డి అనే వ్యక్తి.. ఓ భవనంపై నుంచి దిగుతుండగా.. కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు.

జగన్ ప్రచార సభలో ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

By

Published : Apr 3, 2019, 5:43 PM IST

జగన్ ప్రచార సభలో ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు
ఇటీవల వైకాపా అధినేత జగన్ ప్రచార సభలో పిట్టగోడ కూలిన ఘటన మరిచిపోకముందే.. అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైకాపా ప్రచారానికి జగన్ హాజరయ్యారు. ఇదే సభలో ప్రమాదం జరిగింది. సోమిరెడ్డి అనే వ్యక్తి.. ఓ భవనంపై నుంచి దిగుతుండగా.. కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఇతడిని ఆర్టీసీ కండక్టరుగా గుర్తించారు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒక వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉంది.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details