ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపల్లె డ్రెయిన్​లో గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యం - రేపల్లెలో ప్రమాద వార్తలు

గుంటూరు జిల్లాలో రేపల్లె డ్రెయిన్లో పడి గల్లంతయిన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభించింది. కొల్లిపర మండలం పిడపర్తిపాలేనికి చెందిన సాయి సునిల్, శ్యామంత్ ఇద్దరూ గేదెలు కడిగేందుకు కాలువలో దిగి.. ప్రమాదవశాత్తూ మునిగిపోయారు.

one body found at repalli missed in drain
రేపల్లె డ్రెయిన్లో పడిన ఒకరి మృతదేహం లభ్యం

By

Published : Nov 17, 2020, 11:23 AM IST

గుంటూరు జిల్లాలో రేపల్లె డ్రెయిన్​లో గేదెలు కడిగేందుకు వెళ్లిన సాయి సునీల్, శ్యామంత్ నీటి ప్రవహ ఇద్ధృతికి గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జరిపిన గాలింపు చర్యల్లో యామినేని సాయి సునీల్ మృతదేహం కొనుగొన్నారు.

కొల్లిపర మండలం పిడపర్తిపాలేనికి చెందిన సాయి సునీల్, శ్యామంత్ ఇద్దరూ గేదెలు కడిగేందుకు కాలువలో దిగారు. ప్రమాదవశాత్తూ ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. గ్రామస్థులు గాలించినా ఫలితం లేకపోవటంతో ఎన్డీఆర్ఎఫ్​కు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టగా సాయి సునీల్ మృతదేహం లభించింది. స్థానికుల సహకారంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. సునీల్ మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శ్యామంత్ కోసం గాలించినా ప్రయోజనం లేకపోయింది. శ్యామంత్ కోసం అతని కుటుంబసభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details