గుంటూరు జిల్లా అద్దంకి-నార్కెట్‌పల్లి జాతీయ రహదారిలో నిలిపివున్న ఆయిల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆయిల్ ట్యాంకర్‌ను రోడ్డు పక్కన ఆపి డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రొంపిచర్ల మార్కెట్ యార్డు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండవేడికి ట్యాంకర్ టైర్లు పేలడం వలన ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నారు. ఇండియన్ ఆయిల్‌కు చెందిన ఈ వాహనం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుంది.
ఆయిల్ ట్యాంకర్లో చెలరేగిన మంటలు.. దగ్ధం - fire
గుంటూరు జిల్లా అద్దంకి-నార్కెట్‌పల్లి జాతీయ రహదారిలో ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. ఎండవేడికి టైర్లు పేలడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నాడు. ట్యాంకర్లో ఇంధనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అగ్నికి ఆహుతైన ఆయిల్ ట్యాంకర్
ప్రయాణంలో అలసిపోయి వాహనాన్ని రోడ్డుపక్కన ఖాళీ పొలాల్లో పార్కింగ్ చేసి నిద్రకు ఉపక్రమించిన సమయంలో ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు వచ్చాయన్నారు. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని పేర్కొన్నారు. ట్యాంకర్లోఇంధనం లేకపోవడం వలన పెనుప్రమాదం తప్పిందని స్థానికులు వెల్లడించారు.
ఇవీ చూడండి :రైతులను కష్టాల్లో నెడుతున్న కనకాంబరం