Official cut down hundreds of trees in AP: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే రహదారి వెంట వందలాది పచ్చని చెట్లను అధికారులు నరికివేశారు. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి నుంచి సీఎం అధికారిక నివాసానికి వెళ్లేందుకు నాలుగు వరుసల రహదారి ఉంది. ఇదే మార్గంలోనే నిరంతరం సీఎం జగన్ రాకపోకలు చేస్తుంటారు. ఈ దారి వెంటే సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు, మంత్రులు, ఉన్నతాధికారులు, సహా ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి. రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేసి ఎన్నో ఏళ్ల క్రితమే మొక్కలు పెంచారు.
సీఎం వెళ్లే దారిలో కిలోమీటర్ మేర చెట్లను నరికిన అధికారులు... - ఏపీలో చెట్లను నరికినవేతపై ఆందోళనలు
Official cut down hundreds of trees: అది సీఎం వెళ్లే దారి.. నిన్న మెున్నటివరకు పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉండేది. అయితే అధికారులు ఆదేశించారంటూ కిలోమీటర్ మేర చెట్లను నరికివేశారు మున్సిపల్ సిబ్బంది. ఈ దారి వెంటే... మంత్రులు, ఉన్నతాధికారులు, సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు, ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి. పచ్చగా కళకళలాడిన ఆ రహదారి ఇప్పుడు అందవిహీనంగా దర్శనమిస్తోంది. ఎలాంటి కారణం లేకుండా వందలాది చెట్లను ఎందుకు నరికివేశారో తెలియక.. వృక్ష, ప్రకృతి ప్రేమికులు, నగర ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఆ రహదారి వెంట వెళ్లే వారికి పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని ఇచ్చేవి. సుందరీ కరణ పనుల్లో భాగంగా కొన్ని నెలల క్రితం డివైడర్లపై రంగులు వేసి మరీ అందంగా తీర్చిదిద్దారు. ఉన్నట్లుండి రెండు రోజులక్రితం అధికారులు చెట్లను నరికి వేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో మున్సిపల్ సిబ్బంది చెట్లను సగానికి నరికివేశారు. దీంతో సుమారు కిలోమీటర్ పొడవున మోడుపోయిన వృక్షాలు కనిపిస్తున్నారు. పచ్చగా కళకళలాడిన ఆ రహదారి ఇప్పుడు అందవిహీనంగా దర్శనమిస్తోంది. ఎలాంటి కారణం లేకుండా వందలాది చెట్లను ఎందుకు నరికివేశారో తెలియక.. వృక్ష, ప్రకృతి ప్రేమికులు, నగర ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని మరింత పెంచాల్సి ఉండగా.. ఇలా నరికి వేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: