ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓ బావ.. షార్ట్​ ఫిల్మ్​ షూటింగ్​ ప్రారంభం

లాక్​డౌన్​ కారణంగా ఆగిపోయిన షూటింగ్​లు తిరిగి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. గుంటూరు జిల్లాలో 'ఓ బావ' షార్ట్​ ఫిల్మ్​ షూటింగ్​ మొదలైంది. దీంతో కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన తారలు, సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడిప్పుడే షూటింగ్​లకు సిద్ధమవుతున్నారు.

By

Published : Jun 19, 2020, 3:50 PM IST

o bhava short film shooting
ఓ బావ షార్ట్​ ఫిల్మ్​ షూటింగ్​

లాక్​డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం అయిన తారలు ఇప్పుడిప్పుడే షూటింగ్​లకు హాజరవుతున్నారు. లాక్​డౌన్​ సడలింపులతో గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన జబర్దస్త్ ప్రేమ్ హర్షిత (షేక్​గౌస్ బాష) స్థానికంగా ఉన్న సాంకేతికతను ఉపయోగించుకొని 'ఓ బావ' పేరుతో లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికోసం కోవిడ్​-19 నిబంధనలు పాటిస్తూ గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, చెరువుగట్టు, పరిసర ప్రాంతాల్లో రహదారులు, పొలాల మధ్య చిత్రీకరణ చేస్తున్నారు. బావా మరదళ్ల మధ్య సాగే సరదా సన్నివేశాలతో సాగే ఈ లఘు చిత్రంలో హర్షిత హీరోయిన్​గా, శివ ఆంజనేయులు హీరోగా మరో నలుగురు సహచర నటులుగా నటిస్తున్నారు. ఈ లఘు చిత్రాన్ని యూట్యూబ్ ఛానల్​లో త్వరలో రిలీజ్ చేయనున్నట్లు గౌస్ బాషా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details