వైకాపా నేతలు చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తెదేపా నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ప్రజల గొంతుక వినిపిస్తున్న తెదేపా నేతలను వీధిరౌడీలతో పోలుస్తారా? అంటూ ప్రశ్నించారు. బొత్స ఏం చెబుతున్నారో ఎవరికీ అర్థం కావట్లేదని విమర్శిచారు. జగన్ జైలుకు వెళ్తే...ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని బొత్స, బుగ్గన వంటివాళ్లు తపన పడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ పంతాలకు పోకుండా ఇకనైనా సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.
'బొత్స ఏం చెబుతున్నారో ఎవరికీ అర్థంకావట్లేదు' - బొత్సపై పంచుమర్తి అనురాధ కామెంట్స్
మంత్రి బొత్స ఏం చెబుతున్నారో ఎవరికీ అర్థంకావట్లేదని తెదేపా నాయకురాలు పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. చంద్రబాబును విమర్శించడమే వైకాపా నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
పంచుమర్తి అనురాధ