ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిసెంబర్‌ 2, 3 తేదీల్లో 'ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన': నిమ్మగడ్డ రమేష్‌ - Irregularities in voters list in AP

Nimmagadda Ramesh on Scrutiny of Voter Lists: డిసెంబర్‌ 2, 3 తేదీల్లో ఓటర్ల జాబితాల ఇంటింటి పరిశీలనను వినియోగించుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాల తయారీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.

nimmagadda_ramesh
nimmagadda_ramesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 9:56 PM IST

Nimmagadda Ramesh on Scrutiny of Voter Lists:కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా తలపెట్టిన "ఓటర్ల జాబితాల ఇంటింటి పరిశీలన" కార్యక్రమాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని.. సక్రమమైన ఓటర్ల జాబితాల తయారీలో ఓటర్లు భాగస్వాములు కావాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బూత్ లెవల్ అధికారులు డిసెంబర్ రెండు , మూడు తేదీల్లో ఇంటింటికీ వచ్చిఓటర్ల జాబితాల పరిశీలనచేపడతారని , ఓటర్లు అప్రమత్తంగా ఉంటూ చేర్పులు, మార్పులు, తొలగింపులు , సక్రమంగా ఉన్నదీ లేనిదీ చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్లు లక్ష్యంగా వైసీపీ అక్రమాలు- ఫేక్ ఓటరు ఐడీతో తొలగింపు

పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినిగించుకోవడానికి సక్రమమైన ఓటర్ల జాబితాలు కీలకమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల పరిశీలనకు బూత్ లెవెల్ అధికారులు వచ్చినపుడు ఓటర్లు తమ ఇంటివద్ద ఉండాలని.. ఒకవేళ వారు తమ ఇంటిని సందర్శించని పక్షంలో ఆ విషయాన్ని ఫిర్యాదు చేయాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటికి వచ్చే సమయంలో నిబంధనల మేరకు నివాస ధృవపత్రం సహా అన్ని రకాల పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. జాబితాలో తమ పేర్లు గానీ, కుటుంబ సభ్యులపేర్లు గానీ లేనిపక్షంలో ఫారం 6ను సమర్పించాలని, తమ ఇంటి నంబరులో కుటుంబానికి సంబంధంలేని వ్యక్తులపేర్లు ఉంటే వాటి తొలగింపు కోసం ఫారం 7ను సమర్పించాలని అన్నారు. కుటుంబసభ్యుల పేర్లు వేర్వేరు బూత్​లలో ఉంటే వారు ఒకే బూత్ జాబితాలోకి మార్చేందుకు ఫారం 8 సమర్పించాలని తెలిపారు.

హలో! ఆ రోజు ఓటు వేసి వెళ్తాం - మా ఓటు అాలాగే ఉంచండి! ఓటరు జాబితాలో కావల్సినవారివి, మృతుల పేర్లు మాత్రం కొనసాగుతాయ్!

ఇచ్చిన ఫారాలకు తగిన రసీదు కూడా పొందాలని రమేష్‌కుమార్‌ సూచించారు. రాష్ట్రంలో ఫారం 7ను దుర్వినియోగం చేసి పలువురు అసలైన ఓటర్ల పేర్లను జాబితాల నుండి తొలగించినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని.. అందులో మూకుమ్మడి దరఖాస్తులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం మూకుమ్మడి తొలగింపుల పరిశీలన కోసం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ ఉంటుందని.. ఆ కమిటీ ఆమోదంతోనే తొలగింపులు చేయాల్సి ఉంటుంది.. ఈ విషయాన్ని ఓటర్లు , వివిధ రాజకీయ పక్షాల గమనంలో ఉంచుకోవాలని అన్నారు. నివాస గృహంలో ఉండటం లేదన్న పేరుతో ఓటర్ల పేర్లను అధికారులు పెద్ద ఎత్తున తొలగిస్తున్న ధోరణి కూడా కనిపిస్తోందని అన్నారు.

ఇలాగేనా వైనాట్! టీడీపీ కంచుకోటలో ఓట్ల తొలగింపునకు భారీగా ఫారం-7 దరఖాస్తులు - ఎమ్మెల్యే మద్దాళి వాట్సప్‌ చాటింగ్‌ను బయటపెట్టిన టీడీపీ

కరోనా అనంతరం ఉద్యోగ, వ్యాపారాల కోసం స్వగ్రామాలలో పని చేస్తున్నారని.. వారి పని పరిస్థితుల ఆధారంగా ఓటు హక్కు కల్పించాల్సిన అవసరం ఉంటుందని రమేష్ కుమార్ తెలిపారు. అధికారుల కారణంగా ఓటు హక్కును కోల్పోయినట్లైతే అటువంటి ఓటర్లు హైకోర్టును ఆశ్రయించి తమ హక్కును తిరిగి పొందవచ్చునని ఆయన సూచించారు. రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కృషి చేస్తోందని.. ఇప్పటికే ఈ విషయంలో ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశామని, సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించామని అన్నారు. సక్రమమైన ఓటర్ల జాబితాల తయారీలో అధికారులకు, ఓటర్లకు సహకరించేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిరంతరం అందుబాటులో ఉంటుందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details