ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కోడెల మృతిపై సోషల్​ మీడియాలో వచ్చే వార్తలు అవాస్తవం' - kodela

కోడెల మృతి పట్ల అనుమానం ఉన్న ప్రతిఒక్కరినీ విచారిస్తామని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసి త్వరలోనే పురోగతి సాధిస్తామన్నారు.

news-on-social-media-is-unreal-says-banjara-hills-acp

By

Published : Sep 18, 2019, 8:34 PM IST

'కోడెల మృతిపై సోషల్​ మీడియాలో వచ్చే వార్తలు అవాస్తవం'

ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు. ఆయన మృతికి గల కారణాలపై అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని విచారణ చేసినట్లు వివరించారు. కోడెల కుటుంబ సభ్యుల స్టేట్​మెంట్లను రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. కోడెల ఫోన్​లోని కాల్​డేటాపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో కాల్​డేటాపై వస్తున్న వార్తలు అవాస్తవమని వాటిని నమ్మొద్దని స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసి త్వరలోనే పురోగతి సాధిస్తామంటున్న బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్​రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details