గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో 493 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 59,753 కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 90 కేసులు..గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే ఉన్నాయి. జిల్లా పరిధిలోని మంగళగిరి-13, సత్తెనపల్లి-18, తాడేపల్లి-17, తుళ్లూరు-11, రెంతచింతల-10, నరసరావుపేట-28, చిలకలూరిపేట-13, బాపట్ల-29, నకరికల్లు-11, రేపల్లె-45, కొల్లూరు-23 కేసుల చొప్పున నమోదయ్యాయి.
ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 52 వేల 983 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో గురువారం ముగ్గురు మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 554 కు చేరింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల ఎక్కువ మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు జిల్లా మూడో స్థానంలో కొనసాగుతోంది.