ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో గుంటూరు సర్వజనాసుపత్రి ఎప్పుడూ ముందుటుందనీ జిల్లా పరిపాలనాధికారి కోన శశిధర్ అన్నారు. జీజీహెచ్లో నూతనంగా ఏర్పాటు చేసిన 3 మాడ్యులర్, 2 నాన్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్.ఏ.బీ.హెచ్. నామ్స్ ప్రకారం కొత్త థియేటర్ల ఏర్పాటు జరిగిందన్నారు. కార్పొరేట్ వైద్యశాలలకు ధీటుగా అధునాతన టెక్నాలజీతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు.
జీజీహెచ్లో మెరుగైన వైద్యం: కలెక్టర్ - గుంటూరు
ఎంతోమందికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న గుంటూరు సర్వజనాసుపత్రి.. నేడు మరిన్ని అధునాతన సదుపాయాలను తన ఒడిలో చేర్చుకుంటోంది. నేడు జీజీహెచ్లో 3 మాడ్యులర్, 2 నాన్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేశారు.
జీజీహెచ్లో నూతన ఆపరేషన్ థియేటర్లు ప్రారంభం