National Level Sports Competitions in Acharya Nagarjuna University: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ జాతీయ క్రీడల పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు ఆర్చరీ, కబడ్డీ, చెస్, హ్యాండ్‌బాల్, ఖోఖో, షూటింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా పోటీలు నిర్వహించారు. బాలుర కబడ్డీలో ఉత్తర్‌ప్రదేశ్‌పై తెలంగాణ ఘన విజయం సాధించింది.
నాగార్జున వర్సిటీలో జాతీయ క్రీడా పోటీలు
National Level Sports Competitions in Acharya Nagarjuna University: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో.. జాతీయ క్రీడల పోటీలను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్నారు.. ఈ క్రీడల్లోకి పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు..
ఖోఖో అండర్19 బాలుర విభాగంలో ఏపీపై తెలంగాణ, త్రిపురపై మధ్యప్రదేశ్ జట్లు విజయం సాధించాయి..బాలికల ఖోఖోలో కర్నాటకపై తెలంగాణ.. బాలుర వాలీబాల్ పోటీలో హిమాచలప్రదేశ్ పై తెలంగాణ ఓ మ్యాచ్‌లో విజయం సాధించింది. అండర్14 విభాగంలో బాలుర 20 మీటర్ల ఆర్చరీలో.. రాజస్థాన్ కు చెందిన ఆయూష్ చర్పోటా 297 పాయింట్లు సాధించి మొదటి, 291 పాయింట్లతో ఝార్ఖండకు చెందిన ఆజాద్ కుషాల్ రెండో స్థానాన్ని సాధించారు. బాలికల విభాగంలో ఉత్తరాఖండ్‌కు చెందిన క్రీడాకారిణి వైష్ణవి (288), తెలంగాణకు చెందిన మమత 253 పాయింట్లతో మొదటి, రెండు స్థానాలను దక్కించుకున్నారు.
ఇవీ చదవండి: