ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నరసారావుపేటలో దశలవారీగా లాక్​డౌన్​ తొలగిస్తాం'

నరసారావు పేటలో దశలవారీగా లాక్​డౌన్​ తొలగింపు ఉంటుందని సబ్​ కలెక్టర్​ దినేష్​ కుమార్​ తెలిపారు. పట్టణంలోని 173 కరోనా కేసుల్లో 88 మంది కోలుకున్నారని ఆయన తెలియజేశారు. క్వారంటైన్​లో​ ఉన్న వాళ్లలో... 40 మందిని ఈ నెల 17 నాటికి ఇళ్లకు పంపిస్తామని చెప్పారు. ఇదంతా 'మిషన్​ మే 15' తోనే సాధ్యమైందని తెలిపారు.

By

Published : May 16, 2020, 11:49 AM IST

Published : May 16, 2020, 11:49 AM IST

narasaraopeta sub collector and mla press meet in town
ఇదంతా 'మిషన్​ మే 15' తోనే సాధ్యమైంది

గుంటూరు జిల్లా నరసరావుపేటలో మే 17 తరువాత దశలవారీగా లాక్​డౌన్​ తొలగింపు ఉంటుందని సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. నరసారావుపేటలోని ప్రభుత్వ కార్యాలయంలో సబ్​కలెక్టర్​తో పాటు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.

నరసరావుపేటలో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో గత 14 రోజులుగా పట్టణంలో పూర్తి లాక్​ డౌన్ అమలు చేశామని అన్నారు. ఇప్పటి వరకు పట్టణంలో 173 కేసులు నమోదు కాగా వాటిలో 88 మంది కోలుకోవడంతో ఇళ్లకు పంపించామని సబ్​కలెక్టర్​ చెప్పారు. ఇంకా 40 మందిని మే 17 నాటికి క్వారంటైన్ నుంచి ఇళ్లకు పంపిస్తామన్నారు. ఇదంతా 'మిషన్ మే 15'తో సాధ్యమైందని ఆయన వివరించారు. పట్టణ ప్రజలు సహకారంతో అధికారులు కరోనా కేసులను నియంత్రించామన్నారు.

మే 18వ తేదీ నుంచి కొన్ని రోజుల పాటు పట్టణంలో లాక్​డౌన్​ సడలింపును దశలవారీగా ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలో వార్డులను రెండు భాగాలుగా విభజించి ఒక భాగం వార్డు ప్రజలు ఒకరోజు ఉదయం 9 గంటలలోపు, రెండో భాగం వార్డు ప్రజలు మరుసటిరోజు బయటకు వచ్చేలా వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.

అలా కొన్నిరోజుల కొనసాగించి తరువాత దుకాణాలను కూడా తెరిచే విధంగా అధికారులతో చర్చించి మరలా తెలియజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ప్రస్తుతం క్లస్టర్​ జోన్​లకు మాత్రం లాక్​డౌన్​ సడలింపు లేదన్నారు. వారికి యథావిథిగా కావలసిన నిత్యావసరాలు... వాలంటీర్ల ద్వారా ఇళ్లకు పంపిస్తామన్నారు. లాక్​డౌన్​ సడలింపులో బయటకు వచ్చే ప్రజలు గమనించి భౌతిక పాటిస్తూ మాస్కులు ధరించి, శానిటైజర్ దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించేలా చూసుకోవాలని వివరించారు.

ఇదీ చదవండి :

ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకోండిలా...!

ABOUT THE AUTHOR

...view details