'వైద్యులకు హోం క్వారంటైన్ అవకాశం కల్పించండి' - how many Doctors went to Quarantine in guntur district
వైద్యులకు కరోనా సోకితే హోం క్వారంటైన్‌కు అవకాశం కల్పించాలని నరసరావుపేటకు చెందిన ప్రైవేట్ వైద్యుడు అన్నే రామ్మెహనరావు కోరారు. ఆ వైరస్ బారి నుంచి ఎలా తప్పించుకోవాలో తమకు అవగాహన ఉంటుందని తెలిపారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి వ్యాధి ఉన్నా తమ ప్రాణాలను లెక్కచేయకుండా వైద్యం అందించేది వైద్యులు. అలాంటి వారికి కనీస గౌరవాన్ని అందించాలని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు అన్నే రామ్మోహనరావు అన్నారు. పొరపాటును వైద్యులకు కరోనా సోకితే వారిని క్వారంటైన్లకు పంపడం సరికాదన్నారు. వైద్య వృత్తిని గౌరవించి ఆ డాక్టర్లకు హోం క్వారంటైన్ అవకాశం కల్పించేలా ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆయన కోరారు. ఆ వైరస్ బారి నుంచి ఎలా తప్పించుకోవాలో తమకు అవగాహన ఉంటుందని తెలిపారు.