NARA LOKESH PADAYATRA : టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రపై అధికారిక ప్రకటన వెలువడింది. జనవరి 27నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. మంగళగిరిని కాపు కాసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. తనని ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి వాడే అన్ని ఆయుధాలను ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందని మంగళగిరిలో కార్యకర్తలకు స్పష్టం చేశారు. మంగళగిరిలో 4రోజులు పాదయాత్ర ఉంటుందని మిగిలిన రోజులు రాష్ట్రమంతా పాదయాత్ర చేయనున్నట్లు లోకేశ్ వెల్లడించారు.
పాదయాత్రపై లోకేశ్ అధికారిక ప్రకటన.. ఎప్పటినుంచంటే? - announcement on lokesh padayatra
LOKESH PADAYATRA FROM JANUARY : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. 2023 జనవరి 27నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు లోకేశ్ అధికారికంగా ప్రకటించారు.
LOKESH PADAYATRA